వికారాబాద్, త్రిశూల్ న్యూస్ :
వేధింపులు తాళలేక భర్తను భార్య కడతేర్చిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలంలో చోటు చేసుకుంది. కురువ కుమార్ (35) బతుకుదెరువు కోసం బంటారం మండల్ రొంపల్లి నుంచి మోమిన్ పెట్ మండలం కేసారం వచ్చాడు. నిత్యం కుమార్ మద్యం తాగొచ్చి భార్యను, పిల్లలను వేధిస్తుండేవాడు. అది తట్టుకోలేక భార్య కురువ రేణుక భర్తపై కారంపొడి చల్లి చీరతో మెడకు బిగించి కడతేర్చింది. కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

No comments:
Post a Comment