ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

December 05, 2025

ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు..!

- ఫీజుల నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కోటా సీట్లకు వార్షిక ఫీజును రూ. 30 వేలుగా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్లకు రూ. 9 లక్షలుగా నిర్ధారించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు వైద్య కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం నుంచి 60 పీజీ సీట్లను జాతీయ వైద్య మండలి (NMC) కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సీట్లకు సంబంధించి ఫీజుల ఖరారుపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించిన విధానంలో ఫీజులను సమీక్షించి ఈ తుది నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఫీజుల ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది నుంచే కొత్త పీజీ సీట్లలో ప్రవేశాలకు మార్గం సుగమమైంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages