- కడపలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు
కడప, త్రిశూల్ న్యూస్ :
చరిత్రలో నిలిచిపోయేలా కడపలో మహానాడును నిర్వహించనున్నట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. కడప వేదికగా ఈనెల 27, 28, 29 జరగనున్న మహానాడు ఏర్పాట్లను సోమవారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడపలో జరిగే ఈ మహానాడుకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న మహానాడుకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడును ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం తెలుగు దేశం పార్టీకి, పార్టీ శ్రేణులకు గర్వకారణంగా నిలుస్తోందని ఆయన తెలియజేశారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మహానాడును జయప్రదం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.

No comments:
Post a Comment