భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి - కలెక్టర్ శుభం బన్సల్ - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

May 27, 2025

భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి - కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక బద్దంగా వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోజాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పి డి లు, సూళ్లూరుపేట , శ్రీకాళహస్తి ఆర్డీఓలు, కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తాసిల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న రేణిగుంట ,పూడి, గూడూరు, రేణిగుంట, పాకాల, తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనుల కు సంబంధించి భూసేకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. సేకరణ పెండింగ్, రోడ్లు పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే లు తిరుపతి- తిరుత్తణి, సి. మల్లవరం - రేణిగుంట, నాయుడుపేట- తిరుపతి, పీలేరు - కాలూరు, రేణిగుంట- కడప లైన్ల పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జిలు తిరుపతి, ఏర్పేడు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరు లైన్లు రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారుల పనులు పూర్తి చేయాలని భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకొని నాణ్యత తో పనులు పూర్తి కావాలని అన్నారు. రేణిగుంట, తిరుచానూరు రైల్వే లైన్ లో భాగంగా భూ సేకరణకు సంబంధించిన పనులును సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, ఆర్ అండ్ బి, ఎస్ ఈ మధుసూదన్ రావు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ సురేంద్ర నాయుడు నేషనల్ హైవే పిడిలు చెన్నై నెల్లూరు తిరుపతి రవీంద్రరావు, వెంకటేశ్వర్లు, వెంకట చలపతి, నేషనల్ హైవే కాంట్రాక్టర్లు, జి సెక్షన్ పర్యవేక్షకులు,సంబంధిత మండలాల తాహసిల్దార్లు మరియు సంబదిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages