కడప, త్రిశూల్ న్యూస్ :
కడప వేదికగా తెలుగుజాతి గర్వించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహానాడు సభలో అత్యంత ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వేదికపై ఆశీనులైన తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులు డాక్టర్ దివాకర్ రెడ్డిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయంగా పలకరించి అభినందనలు తెలిపారు. దీంతో ఒక్కసారిగా మంత్రముగ్ధుడైన దివాకర్ రెడ్డి తనకు తుడా చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు ప్రజాసేవలో కొనసాగే భాగ్యం కల్పించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ టిడిపి పార్టీకి విధేయతతో సేవ చేసే సైనికులను తయారు చేయాలని దివాకర్ రెడ్డికి సూచించారు. మహానాడు ఇంత పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగడం లో ప్రతి కార్యకర్త కృషి ఉందని కొనియాడారు. పార్టీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా అందుకు సాగాలని మంత్రి సూచించారు.దివాకర్ రెడ్డికి ప్రశంసల వెల్లువ ఆధ్యాత్మిక నగరం తిరుపతి తుడా చైర్మన్ గా ప్రతిష్టాత్మ పదవి చేపట్టిన డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డికి మహానాడు వేదికగా ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు ఆయనకు అభినందనలు తెలుపుతూ ఆత్మీయంగా పలకరించారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పదవికి వన్నె తేవాలని పలువురు ఆశీర్వదించారు

No comments:
Post a Comment