కడప గడపలో ఘనంగా అనంత ఆడబిడ్డ జన్మదిన వేడుకలు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

May 28, 2025

కడప గడపలో ఘనంగా అనంత ఆడబిడ్డ జన్మదిన వేడుకలు..!

- మహానాడు వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

- ఎమ్మెల్యే పరిటాల సునీతకు శుభాకాంక్షలు తెలిపిన వేలాది మంది అభిమానులు

- మంత్రులు, సహచర ఎమ్మెల్యేల శుభాకాంక్షల వెల్లువ
కడప, త్రిశూల్ న్యూస్ :
కడప గడపలో అనంత ఆడబిడ్డ.. పరిటాల వారికోడలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కడపలో మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ఆమె రెండు రోజులుగా అక్కడే ఉంటున్నారు. బుధవారం ఎమ్మెల్యే సునీత జన్మదిన వేడుకలు భారీ స్థాయిలో తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగాయి. ముందుగా ఉదయం ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్.. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే సునీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఉదయం 7.30 గంటల నుంచి 9.30వరకు విడిది కేంద్రం వద్ద అభిమానుల తాకిడి కనిపించింది. అనంతపురం జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సునీతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఊహించని స్థాయిలో అభిమానులు రావడంతో కాసేపు అదుపు చేయలేని పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే సునీతను కలిసేందుకు పోటీ పడ్డారు. ఆ తర్వాత మహానాడు వేదికపై ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఎమ్మెల్యే సునీత సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. స్వీట్ తీసుకుని పరిటాల శ్రీరామ్ చేతుల మీద ఎమ్మెల్యే సునీతకు తినిపించారు. ఈ సన్నివేశాన్ని చూసిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిశారు. ఆయన ఎమ్మెల్యే సునీతకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. 
మహానాడు వేదికగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ అధ్యక్షులు పల్లా, రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆనం, భరత్, అచ్చన్నాయుడు సచహర ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పెద్ద ఎత్తున కలిసి ఎమ్మెల్యే సునీతకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంది మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు అందించిన తన భర్త పరిటాల రవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే అభిమానం తన బిడ్డ శ్రీరామ్ పై చూపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఒకింత ఉద్వేగంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages