ఆకర్షణీయంగా మహానాడు రంగోలి చిత్రీకరణ.. అభినందిస్తున్న నేతలు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

May 28, 2025

ఆకర్షణీయంగా మహానాడు రంగోలి చిత్రీకరణ.. అభినందిస్తున్న నేతలు..!

కడప, త్రిశూల్ న్యూస్ :
కడపలోని మహానాడు వేదిక ముందు పార్ట్ టైం చిత్రకళా ఉపాధ్యాయులు చిత్రీకరించిన మహానాడు 2025 (రంగోలి)చిత్రం చూపరును ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్, డీఈవో, సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు కడపలోని సమగ్ర శిక్షా కింద జిల్లాలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు పార్ట్ టైం చిత్రకళా ఉపాధ్యాయులు మహానాడులో విధులు నిర్వర్తించారు. ఈ మేరకు మహానాడు వేదిక ఎదుట మహానాడు -2025 రంగోలి చిత్రాన్ని ఉప్పు, రంగుల పొడితో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి సుందరంగా చిత్రీకరించారు. రాత్రివేళ సుమారు 7 గంటల పాటు శ్రమించి ఆదర్శనీయంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం తెదేపా ముఖ్య నాయకులను, నేతలను ఎంతో ఆకర్షించడంతో వారు పార్ట్ టైం చిత్రకళా ఉపాధ్యాయుల కళా నైపుణ్యాన్ని అభినందించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages