నందమూరి తారక రామారావు ఈ మాట ఓ సంచలనని, రాజకీయాల్లో ప్రభంజనమని, ప్రతి తెలుగు వాడి ఆత్మగౌరవమని, ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపమని, సంక్షేమ పథకాలకు తారకమంత్రమని, రాష్ట్ర టిడిపి తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా నేషనల్ గ్రీన్ ఫీల్డ్ అయిన కడియం మండలం కడియపులంకలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ మహానుబావుడిని స్మరించుకుంటు ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మార్గాని మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మరెన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించారన్నారు. పేద ప్రజల కొరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నేటికీ అమలు జరుగుతున్నాయంటే పేద ప్రజల గురించి ఎన్టీఆర్ రూప కల్పన చేసిన ఆలోచన విధానం ఆచరణీయత్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బోడపాటి గోపి, గ్రామకమిటీ అధ్యక్షుడు సత్తి వెంకట గిరి, కోమలి రామకృష్ణ, పడమటి ప్రసాద్, యడ్ల నరేష్, బండి నాగమణి, వడ్లమూరి శివ, బాదం ఈశ్వరుడు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
అమరావతి, త్రిశూల్ న్యూస్ :

No comments:
Post a Comment