తాగునీరు ఇప్పించండి మహాప్రభు..? - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

June 27, 2025

తాగునీరు ఇప్పించండి మహాప్రభు..?

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం, గుడిపల్లి గ్రామపంచాయతీకి చెందిన బిజిగానిపల్లి గ్రామంలో గత ఆరు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్రామం కోసం వేసిన తాగునీటి బోరు నందు నీరు ఇంకిపోవడంతో గ్రామస్తులకు నీటి ఎద్దడి తలెత్తింది. అప్పటినుండి అధికారులకు, ప్రతిరోజు విన్నవించుకుంటున్న ఫలితం లేకపోయింది. దీంతో గ్రామంలోని మహిళలు వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. వ్యవసాయ రైతులు కూడా ప్రతిరోజు నీరు పంటలకు నీరు సరిపోకపోవడంతో వారు కూడా నీళ్లు పట్టలేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో గ్రామస్తులు తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. స్పెషల్ గ్రాండ్ నుండి గుడిపల్లి మండలంలో తాగునీటి పరిష్కారం కోసం రూ. 48 లక్షలు గ్రాండ్ మంజూరైన కూడా ఇంతవరకు బిజీగానే పల్లి గ్రామంలో నూతన బోరు వేయలేకపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు పంచాయతీలోని ఇతర గ్రామాలకు నీరసరపరా చేస్తున్నారు కానీ ఒక్క బిజిగానిపల్లి గ్రామానికి మాత్రం ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయలేకపోతున్నారు. అధికారులకు, అధికార పార్టీ నేతలకు విన్నవించుకున్న కూడా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు గుడిపల్లి మండల కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్ అధికారి వారికి రాతపూర్వకంగా అర్జీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజిగానిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages