కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం పట్టణం మోడ్రన్ కాలనీ, దలవాయి కొత్తపల్లి ప్రాంతాలలో 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గడపగడపకు వెళుతూ ప్రజల సమస్యలను విచారిస్తూ, సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో టిడిపి అధికారం చేపట్టి సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఇంటింటి సర్వే నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలనలో ప్రజలను భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇంటింటి సర్వేకి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ క్లస్టర్ ఇన్చార్జి తిరుమగళ్, డీకేపల్లి యూనిట్ ఇంచార్జ్ నబి, బూత్ కన్వీనియర్ గనివుల్లా, కో కన్వీనర్ అంజద్, ఎస్టీ సెల్ అధ్యక్షులు నాగభూషణం, మైనారిటీ యూత్ అధ్యక్షులు అస్లాం, స్థానిక మహిళ అధ్యక్షురాలు షహనాజ్, నాయకులు సోమశేఖర్, ఫరూక్, సమీర్, ఫైరోజ్, ఆర్ముగం, షణ్ముగం నాయుడు, డీకే పల్లి మణి, ఇర్ఫాన్, ప్రకాష్, రవి, సురేష్, స్వామి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment