సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట పర్యటన..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 27, 2025

సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట పర్యటన..!

- పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న నారా చంద్రబాబునాయుడు

- హెలిప్యాడ్, పింఛన్ పంపిణీ గ్రామాలను కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి పరిశీలించిన రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు
రాజంపేట, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటవ తేదీన రాజంపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం రాజంపేట పరిసరాలలోని పలు గ్రామాలను, హెలిప్యాడ్ కు అనువైన మైదానాలను రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి పరిశీలించారు. ముందుగా తాళ్లపాక, ఎంజీపురం, బోయినపల్లి, కూచివారిపల్లి, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలను పరిశీలించి, ముఖ్యమంత్రి పర్యటనకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు రాజంపేట నియోజకవర్గానికి రావడం చాలా ఆనందంగా ఉందని, పేదలకు భరోసా ఇస్తూ, నవరత్నాలను అమలు చేస్తూ, ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే మంచి మనిషి పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాజంపేటకు రావడం మన అదృష్టమని, ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని, ఆయన పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరివేక్షిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్,ఎంపీడీవో, ఎమ్మార్వో, సీఐలు, ఎస్సైలు, అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages