అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కాణిపాక వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 27, 2025

అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కాణిపాక వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు..!


కాణిపాకం, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా పూతల పట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 జరగనున్నా సందర్భంగా వినాయక చవితి పర్వదినమున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం ఆదినారాయణ రెడ్డి సమర్పించారు. మంత్రివర్యుల తో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ , పూతల పట్టు, చిత్తూరు శాసన సభ్యులు కె.మురళీ మోహన్, గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ ఆముద, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ రాజు మరియు ఇతర ఉన్నతాధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి పట్టు వస్త్రాలుసమర్పించేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులకు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులకు వేద పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం కల్యాణ వేదికలో జరిగినవినాయక స్వామి వారి వ్రత కల్పం లో భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు, స్వామివారిచిత్రపటాలన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఆలయ ఈ ఓ పెంచల కిషోర్ అందజేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages