అమరావతి, త్రిశూల్ న్యూస్ :
సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నట్లు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. రూ.1,120 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వినియోగిస్తూ కనీస మౌలిక వసతులు, సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

No comments:
Post a Comment