సేనతో సేనాని సభను విజయవంతం చేయండి - జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 25, 2025

సేనతో సేనాని సభను విజయవంతం చేయండి - జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో

చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 21కి21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. జనసేన పార్టీ ప్రస్తుతం రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కొరకు,జనసేన పార్టీ అధ్యక్షులు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి 30వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే సేనతో సేనాని సభ నిర్వహిస్తున్న తరుణంలో చిత్తూరు జిల్లా నుండి క్రియాశీలక సభ్యులు, జనసైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని సభని దిగ్విజయం చేయాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం.మహేష్ స్వేరో పిలుపునిచ్చారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ దాదాపు 14వేల పై చిలుకు క్రియాశీలక వాలంటీర్లతో ముఖాముఖిగా మాట్లాడే ఈ గొప్ప కార్యక్రమంలో అందరూ పాల్గొని భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావాలని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,భవిష్యత్తులో ఆంధ్రా రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషించబోతున్నదని దీనికొరకు జనసైనికులందరూ కృషి చేయాలని కోరుతున్నామని తెలిపారు. 28 నుండి 30వ తేదీ వరకు వైజాగ్ లో జరిగే సేనతో సేనాని సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని, దీనికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక పిలుపునిస్తున్నామని కోరారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages