చెత్త కుప్పలు ఇక్కడ.. స్వచ్ఛభారత్ ఎక్కడ...? - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 25, 2025

చెత్త కుప్పలు ఇక్కడ.. స్వచ్ఛభారత్ ఎక్కడ...?

 తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
 రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర
 ఆశయంతో పారిశుద్ధ్యపై యుద్ధం ప్రకటించి చెత్తను నిర్మూలించాలనే ప్రధాన లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతుంటే! కొందరు నిర్లక్ష్యంతో వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయడం ఆ ప్రాంతాలు అపరిశుభ్రంగా మారి 
 దుర్గంధ పు వాసనలు వెదజల్లుతున్నాయి.
 తిరుపతి పట్టణంలోని కార్పొరేషన్
 అధికారులు, జిల్లా కలెక్టర్ స్వచ్ఛ తిరుపతి పట్టణం చేయాలని పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే నిత్యం రోగులతో రద్దీగా ఉండే స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో వ్యర్ధాలను వేయడంతో ఆ ప్రాంతంలో పలు క్రిములు ఏర్పడి ఆ ప్రాంతం కంపు కొడుతూ దుర్గంధపు వాసన వెదజల్లుతోంది. స్విమ్స్ ప్రాంగణంలో నిత్యం రోగులు రాకపోకలు, జరుగుతుంది
 వ్యర్థాలను తొలగించేందుకు, శుభ్రంగా ఉంచేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అనేకమంది సిబ్బంది పని చేస్తున్నారు.
 ఆ ప్రాంతంలో వ్యర్ధాలను వేసేందుకు డస్ట్ బిన్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ
 సమీపంలో ఉన్న స్విమ్స్ క్యాంటీన్ 
 ఉత్తరము వైపు అనేక వ్యర్ధాలతోపాటు,
 పండ్ల నుంచి రసం తీసిన వ్యర్ధాలన్నిటిని మరుగున వేయడంతో ఆ ప్రాంతం ఆపరిశుభ్రంగా మారి దుర్గంధపు వాసనలు వెదజల్లుతోంది. బాధ్యత కలిగిన క్యాంటీన్ యాజమాన్యం బ్లాక్ కవర్స్ లో 
 చెత్త వాహనాల్లో వేయకుండా సమీపంలో వేయడంతో వారికి స్వచ్ఛ తిరుపతి పట్టణం అవసరం లేదా అనే కొందరు ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులపై పెత్తనం చేసే సూపర్వైజర్లు ఏమయ్యారు? ఇలాంటి ప్రాంతాల్లో వ్యర్ధాలు వేస్తున్నవి వారికి తెలియదా! ఎందుకు ఆ ప్రాంతాల్లో వ్యర్ధాలు వేయకుండా కట్టడం చేయలేకపోతున్నారని రోగుల కోసం వచ్చిన బంధువులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వికలాంగుల కొరకు ఏర్పాటు చేసిన టాయిలెట్ ఎల్లవేళలా తాళం వేసి ఉండడంతో వికలాంగులు మలమూత్ర విసర్జనకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్విమ్స్ ప్రాంగణంలో ఇలాంటివి ఎందుకు పర్యవేక్షించి అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా రోగాలను నయం చేసే స్విమ్స్ హాస్పిటల్ ప్రాంగణం శుభ్రత పరిశుభ్రత దిశగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గుర్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages