గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.టి. సుధారాణి శనివారం కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బందితో మాట్లాడిన ఆమె, ఆసుపత్రి సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు స్నేహపూర్వక వాతావరణంలో వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు. రోగుల రికార్డులను సమయానికి నమోదు చేసి, ఓపీ సెన్సస్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ కొనసాగించాలని, ఆరోగ్యశాఖ అందిస్తున్న అన్ని రకాల అప్లికేషన్లలో సమాచారాన్ని 100 శాతం అప్‌లోడ్ చేసి పూర్తి చేయాలని డాక్టర్ సుధారాణి స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డివిజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ, స్థానిక వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment