టాస్క్ ఫోర్స్ లో వినాయక చవితి క్రికెట్ మ్యాచ్.. కప్ చేజిక్కించుకున్న పోలీస్ స్టేషన్ టీమ్..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 30, 2025

టాస్క్ ఫోర్స్ లో వినాయక చవితి క్రికెట్ మ్యాచ్.. కప్ చేజిక్కించుకున్న పోలీస్ స్టేషన్ టీమ్..!

-  మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా కానిస్టేబుల్ రాఘవ

- ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ 
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) మైదానంలో శనివారం క్రికెట్ మ్యాచ్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఈ పోటీలలో పోలీస్ స్టేషన్ టీమ్, ఆపరేషన్ టీమ్, హెడ్ క్వార్టర్స్ టీమ్ లు పాల్గొన్నాయి. ఫైనల్స్ కు హెడ్ క్వార్టర్స్ టీమ్, పోలీస్ స్టేషన్ టీమ్ లు చేరుకున్నాయి. 10 ఓవర్లకు గాను పోలీసు స్టేషన్ టీమ్ 93 పరుగులు చేయగా, హెడ్ క్వార్టర్స్ టీమ్ 90 పరుగులు తీసి వెనుకబడింది. మ్యాచ్ లో గెలుపొందిన పోలీసు స్టేషన్ టీమ్ కు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఐపీఎస్ ట్రోఫీని బహూకరించారు. ఇందులో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపికైన కానిస్టేబుల్ రాఘవకు షీల్డ్ అందజేసారు. ఇందులో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్స్ లో బిజీగా ఉండే సిబ్బందికి ఆటవిడుపుగా ఈ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బంది అందరూ ప్రతిభ కనపరిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వి. శ్రీనివాస రెడ్డి, ఎండీ షరీఫ్, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్, ఆర్ ఐ సాయి గిరిధర్, ఎస్ ఐ రఫీ, ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, విష్ణు వర్ధన్, వినోద్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages