ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి - మంత్రి అచ్చెన్నాయుడు - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 27, 2025

ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి - మంత్రి అచ్చెన్నాయుడు


శ్రీకాకుళం, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు విజయ మాధవి గారితో కలిసి నిమ్మాడ గ్రామంలో వినాయక చవితి పండుగ ఉత్సవ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విఘ్నేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి పండుగ అనేది మనందరి జీవితాల్లో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక రోజు అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విఘ్నేశ్వరుడైన గణపతి దేవుడు జ్ఞానానికి, విజ్ఞానానికి, విజయం సాధించడానికి మూలాధారం అని, ప్రతి ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం మనం పాత తరాలనుండి కొనసాగిస్తున్న గొప్ప సంప్రదాయం అన్నారు. ఈ పండుగ మన కుటుంబ సుఖశాంతులకు, సమాజ శ్రేయస్సుకు ప్రతీక అని, వినాయక చవితి మనకు ఐక్యతను, సమానత్వాన్ని, భక్తిని, ధర్మాన్ని బోధిస్తుందన్నారు. ఇటువంటి పండుగలు మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి అని అన్నారు. గణపతి దేవుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, రైతులకు మంచి వర్షాలు, పంటలు పండాలని ఆకాంక్షించారు. పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages