జనసేన పార్టీలోని 7 సిద్ధాంతాలలో చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించడం, ఈ సిద్ధాంతం ఆశయ సాధన కోసం ఈరోజు వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రసాయనాలు కలిగినటువంటి వినాయకుడిని పూజించడం వలన నిమజ్జనం కోసం చెరువులలో, నదులలో, సరస్సులో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం, భూమి కాలుష్యం జరిగి జలచరజీవులు నశించిపోతున్నాయని ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మాకు దిశా నిర్దేశం చేయడం జరిగిందని, ఆయన ఆశయ సాధన కోసం పర్యావరణాన్ని రక్షించడం కోసం ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ :

No comments:
Post a Comment