హైదరాబాద్ మహానగరానికి మణి మకుఠం ఖైరతాబాద్ మహా గణపతి. ప్రతి ఏడాది ఏదో ప్రత్యేక అవతారంలో గణనాథుడు ఈసారి 'శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి'గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ విఘ్ననాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామి వారిని క్యూలైన్లలో దర్శించుకునేందుకు ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సాక్షిగా ఓ అద్భతం చోటుచేసుకుంది. మహా గణపతి దర్శనం కోసం వచ్చి క్యూలైన్‌లో నిల్చున్న ఓ గర్భిణికి ఉన్నట్టుండి పురుటి నొప్పులు వచ్చాయి. గమనించిన ఉత్సవ కమిటీ సభ్యులు సదరు గర్భిణిని పక్కనే ఉన్న హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా అక్కడ ప్రసవించింది. అనంతరం తల్లి, బిడ్డను పరీక్షించిన వైద్యులు ఇద్దరూ క్షేమమని ప్రకటించారు. స్వామి వారి సన్నిథిలో ప్రసవించడం పట్ల గర్భిణి కుంటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. వినాయక చవితి పర్వదినం రోజుల తమ ఇంట్లోకి మరో కొత్త సభ్యుడు ఆ గణనాథుడి రూపంలో వచ్చాడంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
ఖైరతాబాద్, త్రిశూల్ న్యూస్ :

No comments:
Post a Comment