భక్తులకు మరింతగా సేవ చేసేందుకు కృషి చేస్తా - టిటిడి ఈవో - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 16, 2025

భక్తులకు మరింతగా సేవ చేసేందుకు కృషి చేస్తా - టిటిడి ఈవో

- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ కు టిటిడి పాలక మండలి చైర్మన్ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో సమావేశమై శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది. టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి బోర్డు సమావేశానికి హాజరైన ఈఓకు టిటిడి చైర్మన్, సభ్యులు స్వాగతించి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈఓగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలకమండలి సభ్యులు ఆకాంక్షించారు. టీటీడీ ఈవోగా రెండవసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలను తీసుకుని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈవో తెలిపారు. అంతకుముందు టిటిడి చైర్మన్ మరియు బోర్డు సభ్యులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను సన్మానించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages