అన్నమయ్య జిల్లాలో పెన్షన్ డబ్బులతో సచివాలయ లైన్ మెన్ పరార్..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 01, 2025

అన్నమయ్య జిల్లాలో పెన్షన్ డబ్బులతో సచివాలయ లైన్ మెన్ పరార్..!

కురబలకోట, త్రిశూల్ న్యూస్ :
వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వం అందజేసే పింఛన్ డబ్బులతో ఉద్యోగి పరారైన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకొంది. కురబలకోట ఎంపీడీఓ గంగయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంగళ్లుకు చెందిన వెంకటేష్.. కురబలకోట మండలం తెట్టు సచివాలయంలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ భరోసా సామజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తెట్టు దళితవాడను వెంకటేష్ కు అప్పగించారు. మొత్తం 80మందికి పైగా లబ్ధిదారులకు 4.90లక్షల రూపాయలు సోమవారం ఉదయం పంపిణీ చేయాల్సి ఉండగా ఆ డబ్బు తీసుకొన్న వెంకటేష్ పంపిణీ చేయకుండా పరారైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని.. ఈ విషయంపై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ వెల్లడించారు. లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages