- మన ఓటును కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అంటూ పిలుపు
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
దేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏఐసీసీ, పీసీసీ పిలుపుమేరకు శనివారం తిరుపతి పాత నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు లభించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరిస్తోందని ప్రజల ఓటు హక్కును దోచుకుంటోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వానమిక విధానాలను ప్రశ్నిస్తున్న వారి ఓట్లను గల్లంతు చేస్తూ లేని వారి ఓట్లను ఓటర్ల జాబితాలోకి ఎక్కించి దొంగ ఓట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దీనిని అరికట్టడానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేయడం హర్షణీయమన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న అధికారులు, ఏజెంట్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు మద్దతు తెలిపి భాగస్వాములు కావాలని, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, బిజెపి అరాచకాలను తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు బాల గురవం బాబు మాట్లాడుతూ బిజెపి, ఈసీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. బిజెపి అనుసరిస్తున్న ఓటు చోరీతో ప్రజల రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయని విమర్శించారు. నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవడంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోతున్న దుస్థితి బాధాకరమన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని తనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటోందని చెప్పారు. దీనిని ప్రజలు క్షమించరని దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వాలకు ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. ఈ దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే అధికార దాహంతో బిజెపి ప్రభుత్వం ఈసీని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంభంపాటి మురళి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కానీ మోడీ పాలనలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది క్షమించరాని నేరమన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ క్షమించదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ యువ నేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిత్యం కొనసాగిస్తామన్నారు. ఓటు హక్కు కోల్పోయిన ప్రతి ఒక్కరికి దానిని తిరిగి అందించేంతవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశంలో ఓటర్ల జాబితాలో స్పష్టమైన ఫోటోలతో ఓటరు వివరాలు ఉండాలని తెలిపారు. ఎన్నికల ముందు ఓటరు జాబితాలో చేసే మార్పులు చేర్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగంగా ఉంచాలన్నారు. తొలగించిన ఓట్లలో తప్పులు దొర్లితే సమస్య పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదర్ రెడ్డి, కేకేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర మోహన్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణా రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు కేజే నాయక్, ఎన్ ఎస్ యు ఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కళందర్, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త లోకేశ్వర్ రెడ్డి, ఎస్సీ విభాగం నాయకులు నరేంద్రబాబు, తిరుపతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శులు శివకుమార్, తలారి గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె ధవన్ కళ్యాణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాబు, ఉపాధ్యక్షుడు శోభరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం మురళి, తుమ్మ దేవదానం, కేకేసి తిరుపతి నగర నాయకులు దాసరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment