శ్రీకాళహస్తి ఆలయంలో వాళ్ళు కేవలం ఉన్నారంటే ఉన్నారు..అంతేనా సార్లు? - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 30, 2025

శ్రీకాళహస్తి ఆలయంలో వాళ్ళు కేవలం ఉన్నారంటే ఉన్నారు..అంతేనా సార్లు?

శ్రీళహస్తి, త్రిశూల్ న్యూస్ :
ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు ఎన్ని మంచి సంస్కరణలు తెచ్చినా, వాటిని సరిగ్గా అమలు చేయాల్సిన సంబంధిత వ్యక్తులు, అధికారులు సరిగా పనిచేయకపోతే ఇలాగే ఉంటుందేమో మరి..? శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసే భక్తులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు... సరైన సదుపాయాలు కలిగించండి అని కొందరు న్యూస్ రిపోర్టర్ లు సమస్యను శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే కి, సంబంధిత నాయకులకు చేరవేయగా, స్పందించిన వారు వెనువెంటనే సమస్య కు పరిస్కారంగా రేకుల షెడ్డులు నిర్మించారు. ఈ పరిస్కారం భక్తులకు చాలా సౌలబ్యాన్ని కలిగించింది. కొన్నిరోజులకు ఆ రేకుల షెడ్డులు కింద వాహనాలను పార్కింగ్ చేయండి వలన, భక్తుల సౌకర్యార్థం నిర్మించినవి కాస్తా, వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారి, మరలా యదా తదం అయ్యింది. మరలా ఈ సమస్యను గుర్తించి, సమస్యను తెలియపరచగా, నో పార్కింగ్ బోర్డులు పెట్టి, కొన్నిరోజులు అక్కడ పార్కింగ్ చేయకుండా చూసారు. కానీ, ఆ సమస్య మరలా పునరావృత్తం అవుతోంది. కారణం. వీటితో పాటు ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది అన్న ఉద్దేశ్యంతో, బారికేడ్స్ ను ఏర్పాటు చేసారు, కానీ ఉపయోగం ఏముంది, దీనికి కారణం ఏంటి?. ఈ సమస్యలు పరిష్కరానికి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు, దేవస్థానం పెద్దల సహాయ, సహకారాలు ఉన్నాయి, పోలీస్ అధికారుల సహాయ, సహకారాలు కూడా ఉన్నాయి. అందుకే అన్ని సమస్యలకు పరిస్కారాలు చూపించారు. కానీ, అక్కడ పనిచేసే "సిబ్బంది లోపం" కారణంగా ఈ సమస్యలు మరలా, మరలా పునరావృత్తం అవుతున్నాయి.

రేకుల షెడ్డులు నిర్కించారు, కానీ పార్కింగ్ స్థలాలు గా మారాయి అవి, లోపం ఎవరిది?

నో పార్కింగ్ బోర్డులు పెట్టారు, కానీ మరలా పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయి, ఎవరు ఈ సమస్యకు కారణం.? నో పార్కింగ్ బోర్డులు ఉన్నాయి, కానీ అక్కడే వాహనాలను నిలుపుతున్నారు, కానీ అక్కడ వాహనాలు నిలపకూడదు అని చెప్పేందుకు సిబ్బందిని కూడా నియమించారు, కానీ వాళ్ళు పట్టుంచుకుంటున్నారా ? ఏమో మరి? వాళ్ళు కేవలం ఉన్నారంటే ఉన్నారు, అంతేనా సార్లు?
ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, దేవస్థానం అధికారులు ఎన్ని సంస్కరణలు తెచ్చినా ఏమి ఉపయోగం, అక్కడ పనిచేసే సిబ్బంది సరిగా పనిచేయాలి కదా? కాస్త సిబ్బందికి సూచనలు ఇస్తూ, వారి డ్యూటీ వారు సరిగ్గా చేసుకునేలా చూస్తే బాగుటుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages