కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం పట్టణంలోని శాంతినగర్ ప్రాంత ప్రజల విద్యుత్ సౌకర్యార్థం కొత్త ట్రాన్స్ఫార్మర్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో రెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్‌ను రెస్కో అధ్యక్షులు ప్రతాప్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ శాంతినగర్ ప్రాంత ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా తక్షణమే చర్యలు తీసుకున్నామని, ఇకపై విద్యుత్ అంతరాయాలు లేకుండా ప్రజలకు నిరంతర సరఫరా ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడం రెస్కో ప్రధాన లక్ష్యమని, ప్రతి ఇంటికి సౌకర్యవంతమైన విద్యుత్ అందించేందుకు ప్రాధాన్యతనిస్తామన్నారు. కార్యక్రమంలో రెస్కో డైరెక్టర్లు అనసూయ, ఆర్ముగం, శివ, తులసీనాథ్, ముఖ్యమంత్రి పిఎ మనోహర్, వాల్మీకి కుల కార్పొరేషన్ డైరెక్టర్ వేణు, కడ అడ్వైజరీ కమిటీ సభ్యుడు రాజ్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, ఏఎంసి మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, 11వ క్లస్టర్ ఇన్చార్జి కన్నన్, సహ ఇన్చార్జి తిరుమగళ్, యూనిట్ ఇన్చార్జీలు డీకేపల్లి మణి, నబి, సహ ఇన్చార్జి వేలు, కౌన్సిలర్ జిమ్ దాము, డీకేపల్లి మాజీ వైస్ ప్రెసిడెంట్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment