హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం - తుడా చేర్మెన్ - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 16, 2025

హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం - తుడా చేర్మెన్

- కరుణాకర్ రెడ్డి ఉనికి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి పై అసత్య ప్రచారాలు చేయ్యద్దు

- తుడా చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి హెచ్చరిక
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
టిటిడి మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి రోజురోజుకు దిగజారిపోతూ తిరుమల పట్ల, శ్రీవారి పవిత్రత పట్ల నీచంగా మాట్లాడడం హేయమైన చర్య అని తుడా చైర్మన్, టిటిడి ఎక్స్ అఫీషియల్ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుమల చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఇతర బోర్డు సభ్యులతో కలిసి డాలర్స్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీమహావిష్ణు విగ్రహానికి, శనేశ్వరుని విగ్రహానికి తేడా తెలియకుండా టిటిడి చైర్మన్ గా రెండు పర్యాయాలు భూమన కరుణాకర్ రెడ్డి ఎలా పనిచేశారో అర్థం కావడంలేదని దుయ్యబట్టారు. కేవలం తన ఉనికి కోసం దిగజారిపోయి మీడియాలో కనిపించాలన్న ఆత్రంతో శ్రీవారిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలను ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్న కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడడం దారుణమన్నారు. తమ పాలక మండలి ఏర్పడిన తరువాత దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో కనులరా శ్రీవారిని దర్శించుకుని నాణ్యమైన ప్రసాదాలు స్వీకరించి భద్రంగ తిరుగు ప్రయాణమవుతున్నారని ఓర్వలేని కరుణాకర్ రెడ్డి బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవారిపైన అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages