చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్ల కొనుగోలు పై భారీ మొత్తంలో జీఎస్టీని తగ్గిచడమే కాక..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరింత అండగా నిలిచాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు కలెక్టరేట్లోని ఆవరణలో వ్యవసాయ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగానికి చేకూరే ప్రయోజనాల పై అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున ప్రదర్శనకు ఉంచిన ట్రాక్టర్ల, వివిధ వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు నగర మేయర్ కుమారి అముద, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళి మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా ఛైర్పర్సన్ కఠారి హేమలత, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి,, మాజీ ఎమ్మెల్సీ బి.ఎన్.రాజ పాల్గొన్నారు. అంతకు మునుపు కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జీఎస్టీ అవగాహన సదస్సును ముఖ్య అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చాయని, భారత ప్రధాని ఆగస్టు 15న ఎర్రకోట
నుండి జీఎస్టీ ఫలాలను ప్రకటించడం జరిగిందన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు చేకూరుతున్న ప్రయోజనాలను తెలియచెప్పేందుకు దసరా నుండి దీపావళి వరకు జీఎస్టీ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగిందన్నారు. దేశ రైతాంగానికి భారీ ప్రయోగాన్ని చేకూర్చేందుకు ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై 13 శాతం, 7 శాతం స్లాబులను సవరిస్తూ ఒకే ఒక్క స్లాబ్ గా ఐదు శాతం జీఎస్టీ కి తగ్గించడం జరిగింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ఉన్న జి ఎస్ టి విధానంలో సంస్కరణలు తీసుకువచ్చి జి ఎస్ టి 2.0 ను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ విధానం ద్వారా గతం లో ఉన్న 0, 5, 12, 18, 28 లను కుదించి 0, 5, 18 శ్లాబ్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. నిజానికి ఈ శ్లాబ్ విధానం ద్వారా కేంద్ర రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గడంతో పాటు రాష్ట్రాలకు అందే నిధుల వాటా సైతం తగ్గే అవకాశం ఉందని, కానీ శ్లాబ్ విధానం లో మార్పులు రావడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా ప్రభుత్వానికి అందే ఆదాయం తగ్గబోదని అంచనా వేయడం జరిగిందన్నారు. సామాన్య మానవుడి కొనుగోలు శక్తి ని పెంచి పరిశ్రమలు ఏర్పాటుతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందన్నారు. రెండు శ్లాబ్ విధానంతో పన్ను విధానం మరింత సులభతరం అయ్యిందన్నారు. జి ఎస్ టి 2.0 ద్వారా సామాన్య మానవులు వాడే నిత్యావసర ధరలు చాలా వరకు తగ్గాయని, జి ఎస్ టి 2.0 ద్వారా మున్ముందు ప్రజలకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం ద్వారా దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా పేరుతుందని, దీంతో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. వ్యవసాయ మరియు అనుబంధ రంగ రైతులకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, డ్రోన్ లు, అక్వా కల్చర్ పరికరాలు, బయో పెస్టీసైడ్స్, తదితరాల ధరలు తగ్గడం ద్వారా రైతులు మరింత ఆదాయాన్ని చూడొచ్చన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగం, వైద్య పరికరాలు, విద్యా సామాగ్రి, ఆరోగ్య భీమా అంశాలపై పెద్ద ఎత్తున రాయితీలను అందించడంతోపాటు, కొన్నింటికి జీరో శాతం జీఎస్టీ కి పరిమితం చేయడం అభినందించదగిన విషయం అన్నారు. రాష్ట్రం, దేశం ప్రయోజనాల కోసం నిరంతరం ఆలోచన చేస్తున్న ఇటువంటి ప్రభుత్వాలను మనం వెన్నంటే నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ ప్రతినిధి మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయుచున్నదని అందులో భాగంగా జీఎస్టీ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారుజి.ఎస్.టి తగ్గింపుతో బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, రవాణా అంశాలకు పిల్లలు, సంబంధించి జిఎస్టి తగ్గింపు వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, ట్రేడింగ్ ఎంస్ఎంఇలు, నేత, హస్త కళాకారులు, పేపరు - ఫ్యాకేజింగ్, సెలూన్లు, స్పా. యోగా కేంద్రాలు, జిమ్, టైక్స్ టైల్స్ రంగాల్లో పనిచేసే వారికి, హొహొమానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ సాంకేతికకు సంబంధించిన విద్య, జీవితబీమా, ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్పు, ఇ-కామర్స్ అండ్ గిగ్ ఎకానమీ, కనస్ట్రక్షన్ మెటీరియల్, టూరిజం - హాస్పిటాలిటీ, ట్రాన్సుపోర్టు, లాజిస్టిక్స్, బొమ్మలు, స్పోర్ట్సు గూడ్స్, రెన్యువల్ ఎనర్జీ, ఆటోమొబైల్, మాన్యూ ఎక్స్ప్లోరింగో రంగాల్లో హొ హొ జి.ఎస్.టి తగ్గుదల ఉ ందన్నారు. జి.ఎన్.టి తగ్గింపుతో సామాన్య కుటుంబాలకు అత్యంత ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 స్లాబ్ లుగా ఉన్న జి.ఎన్.టిని రెండు స్లాబ్ లుగా తగ్గించిందని చెప్పారు. జి.ఎస్.టి తగ్గింపు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బలపరుస్తుందన్నారు. అనంతరం ఏపీ ఎంఐపి ఆధ్వర్యంలో లబ్ధి పొందిన రైతులకు వివిధ పనిముట్లు సంబంధించిన ప్రొసెడింగ్ కాపీలను ప్రముఖులచే పంపిణీ చేశారు. అనంతరం జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగానికి చేకూరే ప్రయోజనాల పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళి కృష్ణ, డిడి మధుసూదన్ రెడ్డి, ఏపీఎంఐపి పిడి మధుసూదన్ రెడ్డి, పట్టు పరిశ్రమల జాయింట్ డైరెక్టర్ పద్మావతి, మత్స్య శాఖ ఏడి రవి కుమార్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment