శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ :
శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో కేకేసి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ ఫకురుద్దీన్ అధ్యక్షతన యువతకు షేక్ కరీముల్లా కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం యువత ఆయనకు దుస్సాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఫార్మర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రూరల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అర్జునా గురుమూర్తి పాల్గొన్నారు, అనంతరం కరీముల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కి యువత చేరడం చాలా సంతోషకర విషయం అన్నారు .యువ నాయకుల వల్ల పార్టీ బలంగా మారుతుందనీ రాబోయే రోజుల్లో అధిక స్థాయిలో యువత చేరికలు ఉండాలని ఆయన కోరారు. అదేవిధంగా అర్జున గురుమూర్తి మాట్లాడుతూ యువత పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. తదనంతరం ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి యువ నాయకుల చేరుకలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమములో అబ్దుల్ కరీం, దయాకర్, రియాజ్, కిరణ్, వెంకీ, రబ్బానీ, అశోక్, శివ, దినే, ముని కన్నయ్య, ఇర్ఫాన్ ,రహమతుల్లా, ఎస్ శివ , బబ్లు షేక్ ,కుమార్ , బాలా, తాజ్, ముని, బషీర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment