చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, మొత్తం 437 పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.8 కోట్ల జడ్పీ నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అంగన్వాడి కేంద్రాల్లో 78 మరుగుదొడ్లు నిర్మాణం, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో 43 భవనాల నిర్మాణం, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో 496 త్రాగునీటి పైపులైన్ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పోషణ్ అభియాన్, PMMUY, గర్భవతుల సంక్షేమం, 0–6 నెలల పిల్లల ఆధార్ కార్డు నమోదు అంశాలపై కూడా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పిడి వెంకటేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చంద్రశేఖర్, సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment