గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పనిచేయాలి - చిత్తూరు జడ్పీ సిఈఓ - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

December 18, 2025

గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పనిచేయాలి - చిత్తూరు జడ్పీ సిఈఓ

గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ సి.ఈ.ఓ, వి.రవికుమార్ నాయుడు  సూచించారు. గురువారం గుడుపల్లె వెలుగు కార్యాలయం నందు జడ్పీ సిఈఓ మరియు జిల్లా పంచాయతీ అధికారి కే.సుధాకర్ రావులు వారు మండలం పరిధిలోని పంచాయితీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు మరియు విఆర్వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వామిత్వ కార్యక్రమం, ఇంటింటి నుండి చెత్త సేకరణ, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగు నీటి సరఫరా తదితర ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, నిర్ణీత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, డిప్యూటీ ఎంపీడీవో మరియు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages