డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 30, 2026

డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..!

యాదాద్రి భువనగిరి, త్రిశూల్ న్యూస్ :
డబ్బుల కోసం వరుసకు అమ్మమ్మ అయిన 70 ఏళ్ల వృద్ధురాలిని మనవడు హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి  చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట్‌లో వెలుగుచూసింది. ఈ నెల 27న మంటిపల్లి యాదమ్మ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలి బంధువైన మంటిపల్లి రాజు (31)పై అనుమానం రావడంతో పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో రాజు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. డబ్బుల కోసమే యాదమ్మను హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి నగలను తీసుకుని పరారైనట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages