గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు బాలింతలకు రోగులకు బ్రెడ్డు పండ్లు పంపిణీ..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

October 01, 2026

గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు బాలింతలకు రోగులకు బ్రెడ్డు పండ్లు పంపిణీ..!


నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు గురువారం ఉదయం 10 గంటలకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో సొంత ఖర్చులతో ప్రతినెల నిరంతరాయంగా కొనసాగిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ షరీనా న్చేతుల మీందగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు నిరుపేదలైన బాలింతలకు,100 మందికి పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.  ఈ రోజు ,డాక్టర్ షరీనా మాట్లాడుతూ: కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినెల ప్రభుత్వ హాస్పిటల్ నందు క్రమం తప్పకుండా బాలింతలకు, పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం మా హాస్పిటల్ కి వచ్చే పేషెంట్ ని ప్రేమించి దూర ప్రాంతాల నుండి హాస్పిటల్ కి వచ్చే పేద ప్రజలకు ట్రస్ట్ సభ్యుల వారు చేస్తున్న ఇటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని సమాజ సేవ చేతిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ మా సభ్యులు సహకారముతో ప్రతి నెల క్రమం తప్పకుండా నిరంతరముగా హాస్పిటల్ దొర ప్రాంతాన్నించి వచ్చే బాలింతలకు రోగులకు నిరుపేదలు బ్రెడ్డు పండ్లు వాటర్ బాటిల్ బిస్కెట్లు పంపిణీ చేయడం అలాగే సమాజ సేవకు మానవత్వంతో ముందుకొచ్చి మీ వంతు ప్రజలు కూడా భాగస్వామ్మoకావాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు,అత్తి మంజూరి గోపాల్ ,పెయ్యల రమణయ్య పిరిమేటి చెంచయ్య ,కోడి శివ,తదితరులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages