త్రిశూల్ న్యూస్, శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలో ఉదయం నుంచి తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రధాన రహదారిలో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో పట్టణ వాసులు, ఆలయానికి వచ్చిన భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సర్వీసు అయిన 108 అంబులెన్స్ సైతం ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ముందు ఆర్టీసీ బస్సు, కార్లు, ఆటోలు బారులు తీరడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేక నిలిచిపోయింది. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.చిరు వ్యాపారుల బండ్లు రోడ్డుపైకి రావడం, వాహనాల రద్దీ పెరగడం ట్రాఫిక్ కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని, ముఖ్యంగా అత్యవసర వాహనాలకు దారి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:
Post a Comment