- అనుమతులు లేకుండా పట్టా భూముల్లో మన్ను తోలుతున్న పరిస్థితి
- వారిని అడ్డుకున్న భూ ఆయకట్టు యజమానులు
త్రిశూల్ న్యూస్, తిరుపతి :
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బందార్లపల్లి చెరువు కట్ట పై చెట్లు కొట్టుతుండగా అడ్డుకున్న భూ ఆయకట్టు యజమానులు.కట్టపై ఉన్న భారీ వృక్షాలు కొట్టివేసి తొలగించారు. కట్ట పైనుంచి మట్టిని మా పొలంలో అక్రమంగా వేశారని భూ ఆయకట్టు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమని ప్రశ్నిస్తే మా పై దౌర్జన్యానికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు కొట్టి మన్న తోలుతున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కాంట్రాక్టర్ పనులు కూడా చేస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తానని,ప్రశ్నించే వారిపై కేసులు పెడత,బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment