Trishul News

ఈ నెల 6వ తేదీ వరకు వానలే వానలు..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
ఉత్తర - దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని… దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధ గురు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివిరించింది. ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరం పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల ఈ నెల 6వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Post a Comment

Previous Post Next Post