Trishul News

నా మాటలు మిమ్మల్ని కించపరిచి ఉంటే మన్నించండి - ద్రావిడ విసి

- నేను కూడా మీ ప్రాంతం వాడినే.. అన్యదా భావించకండి

- కుప్పం ప్రజలకు ద్రావిడ విసి క్షమాపణలు
కుప్పం, త్రిశూల్ న్యూస్ : ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క మాట తప్పు దొర్లినా ఎంతటి పరిణామలకు దారితీస్తోందో చెప్పలేం..? అలాంటి మాటలే కుప్పం ద్రావిడ ఉపకులపతి కుప్పం ప్రాంత ప్రజలనుద్దేశించి రెండు మాటలు నోరు జారారు. దింతో అగ్రహించిన కుప్పం ప్రజావేదిక సభ్యులు, అఖిల పక్షం నేతలు, సామజిక వేత్తలు నిరసనకు దిగారు. దింతో స్వయానా వైస్ ఛాన్సలర్ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన పత్రిక  విలేకరుల సమావేశంలో వైస్ చాన్సలర్ ఆచార్య తుమ్ముల రామకృష్ణ  ఇక్కడి ప్రాంత ప్రజలకు జన్యుపరమైన సమస్యలు ఉంది పుట్టుకతో వచ్చింది.. చివరిదాకా పోదు, అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన తక్కువ, ఉన్నదాని చెడగొట్టూ కోవాలి.. అంటూ వ్యాఖ్యలు చేశారు.
పై వ్యాఖ్యలు కుప్పం ప్రజల మనోభవాలు, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉండడంతో కుప్పం అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుప్పం ప్రాంత అభిమానులు అందరూ కుప్పం ద్రావిడ యూనివర్సిటి చేరుకొని వైస్ చాన్సలర్ కార్యాలయం ముందు కుప్పం ప్రాంత ప్రజలకు వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమపణ చెప్పాలని బైఠాయించి నిరసన తెలియజేసారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. కుప్పం ప్రజలను కించపరిచే ముందు విసి ఇక్కడి వారి సహకారంతో విధులు నిర్వహిస్తున్న విషయం మర్చిపోకూడదు అని గుర్తు చేశారు. ఎంతో ప్రశాంత వాతావరణానికి నిలయమైన కుప్పం ప్రజలను కించపరచడం భావ్యం కాదని పేర్కొన్నారు. అక్రమ క్వారీలకు అడ్డు పడుతున్నారనే అక్కసుతోనే వీసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న విసి అందరి సమక్షంలో జరిగిన పొరబాటును, జరిగిన వ్యాఖ్యలను గ్రహించి, కుప్పం ప్రజలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, పై వ్యాఖ్యలను తను వెనక్కి  తీసుకుంటున్నట్లు తెలియజేయడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో ఆఖిలపక్ష, ప్రజా సంఘాల నేతలు ఉపేంద్ర, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్, శివశంకర్, మునుస్వామి, బిజెపి శివశంకర్, మంజునాథ్, మణి, గణేష్, ఖాలిమ్, సబ్బు, మంజునాథ్ గౌడ్, వేణు, నరేంద్ర ఆజాద్, నవీన్, మధు, సంపత్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post