Trishul News

స్వాతంత్రం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరిని మననం చేసుకోవాలి..!

- స్వాతంత్రం కోసం పాటుపడిన వారిని గుర్తించడం కోసమే ఆజాది కా అమృథ్ మహోత్సవ్

- కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు నిండిన సందర్భంగా గత మార్చి 12 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం

- జాయింట్ కలెక్టర్ ఎస్ .వెంకటేశ్వర్ 
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
భారతదేశం స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత మార్చి 12 నుంచి దేశమంతటా ఆజాధి కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామని ఈ నెలలో ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని మరణం చేసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్ .వెంకటేశ్వర్ అన్నారు. ఆజాధి కా అమృత్ మహోత్సవాలులో భాగంగా ఆగస్టు ఒకటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మన రాష్ట్రంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య భారతదేశానికి స్వాతంత్రం కోసం నాటక రూపంలో ప్రజలలో గొప్ప మార్పులు తెచ్చిన సాంఘిక సంస్కర్త బళ్లారి రాఘవ జయంతి వేడుకలు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ ఎన్. రాజశేఖర్ లు మొదట పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవ చిత్రపటాలకు నివాళులర్పించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎందరో వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేయడం బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడం జరిగిందని అదేవిధంగా మన దేశానికి ఒక జెండా ఉండాలని ఆ జెండా త్రివర్ణ పతాకంగా అశోకుడి గుర్తు ఉండేలా రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి నేడు అని కృష్ణాజిల్లాలో పుట్టి జాతీయ జెండాను రూపొందించడం జరిగిందని అదేవిధంగా భారత స్వాతంత్రానికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించి గ్రామ గ్రామాల్లో భారత దేశ స్వాతంత్రము కోసం ఎంతగానో పోరాటం చేపి బళ్లారి ప్రాంతంలో ప్రధానంగా ఆయన పోరాటాన్ని నడిపిన కారణంగా బళ్లారి రాఘవగా ఆయన పేరు స్థిరపడిందని అటువంటి మహనీయుల జయంతిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అహింసా పద్ధతిలో వారు చూపిన మార్గాన్ని అనుసరించి బావి భారత పౌరులుగా రూపొందాలని అన్నారు. స్వేచ్ఛ వాయువులు తీర్చడానికి ప్రధాన కారకులైన ప్రతి ఒక్కరిని మననం చేసుకోవడానికి ఈ ఆజాది కా అమృత్ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతొందని అన్నారు. ఈ 15 రోజులపాటు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని తెలుసుకోవడం జరుగుతుందని విద్యార్థులుగా మన దేశ గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈరోజు మనం గౌరవ వందనం ఇచ్చే మన జాతీయ జెండాను రూపొందించిన ఘనత మన ఆంధ్రుడిదే అని, బళ్లారి రాఘవ లాంటి వారికి జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అని డిఆర్ఓ ఎన్. రాజశేఖర్ అన్నారు. ప్రతిరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొని మన దేశ స్వాతంత్ర సమరాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, మన దేశ ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పేలా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీని నిర్వహించి జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ ఉమాదేవి, జడ్పీ సీఈవో ప్రభాకర రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి డిఎంకె తులసి, ఇతర కలెక్టరేట్ ఉద్యోగుల తో పాటు బాల బాలికలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post