Trishul News

ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలు స్పష్టత ఇవ్వాలి..!

- కుప్పంలో 8వరోజుకు చేరిన దళితుల ఆందోళన
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
ఎస్సీ వర్గీకరణపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టత ఇవ్వాలని ఎమ్మార్పిఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. కుప్పం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన దీక్ష కార్యక్రమం మంగళవారంతో 8వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా దళిత నేతలు మాట్లాడుతూ..ఈప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఆమోదించి బీజేపీ తమ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎనిమిది రోజుల నుండి దీక్ష జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరియు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన లాంటి పార్టీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి కల్లిబోల్లి మాటలు చెబుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా వర్గీకరణ కోసం ఆర్డినెన్స్తో ఆమోదం చేసిన చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉషా మొహర కమిషన్ వేయించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నప్పుడు ఓదార్పు యాత్రలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశారని మరియు ముఖ్యంగా జనసేన పార్టీ ఎస్సీ వర్గీకరణకు సామరస్యమైన పరిష్కారం చూస్తామని చెప్పి తమరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్ సక్రమంగా జరుపుకుండా దళిత గిరిజనుల గొంతు నొక్కుతూ భారత రాజ్యాంగ నిర్మాత కల్పించిన హక్కులకు పొడుస్తూ కుప్పం తాసిల్దార్ మరియు ఎంపీపీ వ్యవహరిస్తున్న తీరు చాలా అన్యాయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ మీటింగ్ జరపాలని అలా జరపని పక్షంలో కలిసి వచ్చే పార్టీలో ప్రజాసంఘాలను కలుపుకుంటూ సాధ్యమైన తొందరలోనే కుప్పం తాసిల్దార్ కార్యాలయాన్ని మరియు ఎంపీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ దీక్షా కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు, దేవరాజ్ మాదిగ, ఎంఎస్పి పార్టీ జిల్లా నాయకులు ఎస్ రాజకుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ ప్రకాష్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ కుప్పం కో కన్వీనర్ మురుగేష్ మాదిగ, శాంతిపురం మండల సోషలిస్ట్ పార్టీ కన్వీనర్ ఎం రవీంద్ర మాదిగ, రామకుప్పం మండలం మహాజన సోషలిస్ట్ పార్టీ కన్వీనర్ గోవిందప్ప మాదిగ, కో కన్వీనర్ ఎం.రామకృష్ణ, సంపత్, సుబ్రహ్మణ్యం తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post