Trishul News

శ్రీలంకలా మారిన బాంగ్లాదేశ్..?

- భగ్గుమంటున్న నిరసన సెగలు
బాంగ్లాదేశ్, త్రిశూల్ న్యూస్ :
బంగ్లాదేశ్‌ కూడా శ్రీలంకలా ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకుంది. మొన్నటివరకు శ్రీలంకలో తొలుత ఇంధన సంక్షోభంతో ప్రారంభమై చివరి రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో అట్టుడికి పొయింది. తీవ్ర ప్రజా ఆగ్రహాన్ని చవిచూసింది శ్రీలంక. ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది లంక దేశం. తదనంతరం ఇప్పుడూ బంగ్లదేశ్‌ కూడా శ్రీంకలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ మేరకు బంగ్లదేశ్‌లోని ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం ఇంధన ధరలను 52% పెంచడంతో తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన కేంద్రాలను ముట్టడించి ఇంధన ధరలను తగ్గించాలంటూ డిమాండ్‌ చేశారు. ఐతే ఇంధన ధరల పెంపుకు కారణం రష్యా ఉక్రెయిన్‌ యుద్ధమేనని బంగ్లదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. పెరిగిన ఇంధన ధరలు దేశంలోని సబ్సిడి ధరల భారాన్ని తగ్గించగలవని ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఐతే ఇప్పటికే 7 శాతానికి పైగా నడుస్తున్న ద్రవ్యోల్బణం పై మరింత ఒత్తిడిని కలిగిస్తోంది. ఇదిగా నేరు సామన్య ప్రజల పైనే ప్రభావం చూపిస్తోంది. అదీగాక బంగ్లదేశ్‌ కూడా దాదాపు 46 బిలియన్ల డాలర్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. పెరిగిన ఇంధనం, ఆహార ధరలు దిగుమతుల ఖర్చులను పెంచేశాయి. దీంతో ప్రపంచ ఏజెన్సీలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. ఇంధన ధరల తోపాటు పెరుగుతున్న నిత్వావసర ధరలు కారణంగా సామాన్య ప్రజలపై రోజుల వారి ఖర్చలు భారం అధికమైంది. అదీగాక బంగ్లదేశ్‌ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకే విలాసవంతమైన వస్తువుల దిగుమతులు, లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌(ఎల్‌పీజీ)తో సహా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధించింది. అంతేకాదు డీజిల్‌తో నడిచే పవర్‌ప్లాంట్‌లను కూడా మూసివేయడం వంటి చర్యలు కూడా తీసుకుంది. కొత్తగా పెంచిన ధరలు అందరికి ఆమోదయోగ్యం కాదని తెలుసు కానీ మాకు వేరే గత్యంతరం లేదని, దయచేసి ప్రజలు ఓపిక పట్టాలని ఇంధన, ఖనిజ వనరుల శాఖమంత్రి నస్రుల్ హమీద్ అన్నారు.

Post a Comment

Previous Post Next Post