Trishul News

విజిలెన్స్ అధికారుల దాడులు..!

-174 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

-ఇద్ధరిపై కేసు నమోదు

సత్యవేడు, త్రిశూల్ న్యూస్ :

సత్యవేడు పట్టణంలోని బాలికల ఉన్నతపాఠశాల సమీపంలో ఓ ఇంట్లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు ఆదివారం వేకువ జామున స్వాధీనం చేసుకున్నారు.సత్యవేడు పట్టణానికి చెందిన రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ష్యుడు సునీల్, ప్రభాకర్ నాయుడు  ఆంధ్రా, తమిళనాడు నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి సత్యవేడుకు తరలించి ఇక్కడ నుంచి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారని అధికారులు గుర్తించారు. వీరివురు సేకరించి ఉంచిన 174 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వీరిద్ధరిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏఆర్ విజయ్ కుమార్, వారి సిబ్బంది తెలిపారు. గత కొన్నాళ్ళుగా పేదల కడుపుకొట్టి డీలర్లు ఈ అక్రమ బియ్యాన్ని పై మాఫియా సభ్యులకు తరలించి డబ్బులు దండుకునే వారని విజిలెన్స్ అధికారుల విఛారణలో తేలిందని సమాఛారం. ప్రజా పంపిణీ వ్యవస్థపై పూర్తిస్థాయి లో పర్యవేక్షణ లేకపోవడం మూలంగా పేదలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యం పక్కదారి పడుతోందని విమర్శలు ఉన్నాయి. ఇటీవల పిచ్చాటూరు, కేవిబిపురం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సత్యవేడు నియోజకవర్గంలో రేషన్ బియ్యం జోరుగా పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఇకనైనా జిల్లా రెవిన్యూ,పోలీస్, విజిలెన్స్ అధికారులు ప్రజా పంపిణీ వ్యవస్థపై పటిష్టమైన చర్యలు తీసుకుని పేదలకు ప్రభుత్వ బియ్యం అందెటట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Post a Comment

Previous Post Next Post