Trishul News

కన్నుల పండుగగా దేశమ్మ ఆడినెల ఉత్సవాలు..!

- తితిదే పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు
నగరి, త్రిశూల్ న్యూస్ :
నగరి పట్టణంలోని నగరి ప్రజల గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లి అమ్మవారికి ఆడినెల పూజ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మంగళవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా, శ్రీసెల్వమణి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున మొదటి సారిగా పట్టువస్త్రాలను మంత్రి రోజా సెల్వమణీ దంపతులు ఆలయ సమీపంలోని శ్రీ వినాయక స్వామి వారి ఆలయం నుంచి కాలినడకన తీసుకుని వెళ్ళి దేశమ్మ వారికి స్వయంగా సమర్పించారు. ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజారులు విశేష పూజలు నిర్వహించి, వేద మంత్రాల మధ్య మంత్రి రోజా సెల్వమణి దంపతులను ఆశీర్వదించి, ద్రౌపదమ్మ వారి చిత్రపటాన్ని బహుకరించారు. అంతేకాకుండా ద్రౌపదీ అమ్మవారికి బంగారు తాళిబొట్టు ను మంత్రి దంపతులు తమ వంతు విరాళంగా భక్తి పూర్వకంగా సమర్పించారు.
అనంతరం హరికధా కార్యక్రమాన్ని విక్షించారు. ఆర్.కె.రోజా సెల్వమణి దంపతులు దేశమ్మ అమ్మవారికి పొంగళ్ళుతో నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కమీషనర్ ,ప్రజా ప్రతినిదులు, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post