Trishul News

ఉద్యానవన పంటలను ప్రోత్స హించండి - జిల్లా కలెక్టర్

- కుప్పంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ పేర్కొన్నారు. మంగళవారం కుప్పం మండలం వెండుగంపల్లి సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలతో పాటు పూలసాగు ఎక్కువగా ఉంటుందని అందుకనుగుణంగా ఉద్యానవన అసిస్టెంట్ అందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వా lలని సూచించారు.
ఈ సచివాలయ పరిధిలో 110 ఎకరాలలో హార్టికల్చర్, 42 ఎకరాలలో పూల సాగు జరుగుతుందని ఎక్కువగా ఇక్కడ పండిన పూలను తిరుపతి, చెన్నై ప్రాంతాలకు పంపడం జరుగుతుందని, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులకు అవగాహన పెంచేందుకు అవగాహన కార్యక్రమాల నిర్వహిస్తున్నామని హార్టికల్చర్ అసిస్టెంట్ కలెక్టర్ వివరించారు
అనంతరం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణము, తరగతి గదులు, ఆటస్థలం పరిశీలించగా ఆర్ ఓ ప్లాంట్, కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ కలెక్టర్ కు విన్నవించగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కుప్పం ఆర్డీఓ శివయ్య, కుప్పం తహసిల్దారు సురేష్, ఎంపిడిఓ విజయ్ దత్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతి నిధులు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post