Trishul News

స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమ ర్యాంకు సాధిద్దాం - నెల్లూరు కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ప్రణాళికాబద్ధమైన పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టి, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకు సాధిద్దామని కమిషనర్ హరిత ఆకాంక్షించారు. కమిషనర్ కార్యాలయంలో ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గార్బేజ్ ఫ్రీ సిటీగా రూపొందించేందుకు పారిశుద్ధ్య నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను పాటిస్తూ ఉన్నత ఫలితాలను పొందుదామని తెలిపారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల సమిష్టి కృషితో గత ఏడాది సాధించిన ర్యాంకు కన్నా ఉత్తమమైన ర్యాంకును ఈ ఏడాది సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, ఆరోగ్య శాఖల సమన్వయంతో స్వచ్ఛ సర్వేక్షన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గార్బేజ్ ఫ్రీ సిటీగా నెల్లూరును తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. సచివాలయ శానిటేషన్ కార్యదర్శులపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించి, యూజర్ చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు సంపత్ కుమార్, శ్రీనివాస్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post