Trishul News

రాజకీయాల్లో విప్లవం తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్‌ - వెంకయ్యనాయుడు

తెనాలి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో దివంగత మాజీ సీఎం, నటుడు నందమూరి తారక రామారావు (ఎన్జీఆర్‌) శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ రాధారాణి హాజరయ్యారు. కార్యక్రమానికి ప్రత్యేక అథితులుగా ఎన్జీఆర్‌ కుమార్తె లోకేశ్వరి, కుమారుడు రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఎన్టీఆర్‌ను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ''చారిత్రక పురుషుడు నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్‌. బలహీన, పేద వర్గాలకు చేయూతనిచ్చారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారు. ఆడపడుచులను ఆదరించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు'' అని వెంకయ్య నాయుడు కొనియాడారు.

ప్రకృతిని ప్రేమించాలి.. కలిసి జీవించాలి..

''గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. గాంధీ జీవితాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికతకు, నడవడికకు చిహ్నం మనం పాటించే పద్ధతులు. గాంధీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగానే కాకుండా ఆయన ఆలోచనలు అందరూ ఆచరించాలి. సెల్‌ఫోన్లు ఎక్కువగా వాడితే హెల్‌ఫోన్లు అవుతాయి. ప్రకృతిని ప్రేమించాలి.. కలిసి జీవించాలి. పచ్చదనం మనిషికి ప్రశాంతతను ఇస్తుంది. ప్రతి ఒక్కరూ మహానుభావులు చూపించిన మార్గంలో నడవాలి'' అని వెంకయ్య అన్నారు.

Post a Comment

Previous Post Next Post