Trishul News

మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయండి - ఎమ్మెల్యే భూమన

- తిరుపతి మునిసిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం 
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
మాస్టర్ ప్లాన్ రోడ్ల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి, మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి లు స్థానిక అక్కారం పల్లి, కోర్లగుంట, కొంకా చెన్నాయగుంట, గొల్లవాని గుంట, చింతలచేను రోడ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు దూరదృష్టితో ఆలోచించకపోవడం తిరుపతి నగరం ఎక్కడ వేసిన గోంగలి అక్కడే అన్నట్లు ఉండిపోయిందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని చోట్ల అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. యుద్ద ప్రాతిపదికన మాస్టర్ ప్లాన్ రోడ్ల పూర్తి చేస్తున్నామన్నారు. రహదారులు పెరగడం వలన నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. కౌన్సిల్ అనుమతితో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లను 35 కోట్ల రూపాయల వ్యయంతో ఎనిమిదిన్నర కిలో మీటర్లు వేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి నగరం అభివృద్ధి చెందాలంటే రహదారులు పెరగాలనే ఉద్దేశ్యంతో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుందన్నారు. తిరుపతి నగరాభివృద్ధిలో భాగంగా నగరానికి తూర్పు వైపున 12 మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటికే గెస్ట్ లైన్ ప్రక్క నుండి రేణిగుంట రోడ్ హిరోహెూండా షోరూమ్ వరకు వేసిన అన్నమయ్య మార్గ్, అదేవిదంగా డిబిఆర్ హాస్పిటల్ వైపు నుండి వేసిన వై.ఎస్.ఆర్ మార్గ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు నుండి కొంత మేరకు ఉపసమనం లభించందన్నారు. స్థానిక ప్రజలు తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు.

Post a Comment

Previous Post Next Post