Trishul News

మండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు సెలవు..!



అమరావతి, త్రిశూల్ న్యూస్ :
సముద్రంలో ఏర్పడిన మాండుస్‌ తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. తుఫాను తీరం దాటిన తర్వాత రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.తుపాను తీరం దాటేటప్పుడు 60 నుంచి 70 కి.మీరా వేగంతో గాలులు వేసే అవకాశం ఉందని… తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నెల్లూరులో మాండూస్ తుఫాన్ ప్రభావం పై మా ప్రతినిధి అమర్ నాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలపై మాండస్ తుఫాన్ ప్రభావంతో.. భారీ వర్షాలు జిల్లాలను ముంచెత్తనున్నాయి. తుఫాను ప్రభావంపై తిరుపతి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ముంపు ప్రాంత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తిరుపతి నగరపాలక కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 0877 2256766 ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళా శాలలకు సెలవు ప్రకటించారు చిత్తూరు జిల్లా కలెక్టర్. మాండూస్ తుఫాను నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రకటన చేశారు.

Post a Comment

Previous Post Next Post