Trishul News

జంతర్‌మంతర్‌ వద్ద అమరావతి రైతులు నిరసన..!

న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. తమ ఉద్యమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతుల నిర్ణయించారు. దీనిలో భాగంగా 'ధరణికోట నుంచి ఎర్రకోట' పేరుతో ప్రత్యేక రైలులో దిల్లీ చేరుకున్న రైతులు.. ఇవాళ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు.రైతుల నిరసనకు తెదేపా, కాంగ్రెస్‌, జనసేన, సీపీఐ నేతలు మద్దతు పలికారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, జనసేన నేత హరిప్రసాద్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.
పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించనున్నారు. సోమవారం రామ్‌లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్‌ సంఘ్‌ ర్యాలీలో రైతులు పాల్గొననున్నారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ అమరావతి రైతు ఉద్యమాన్ని తమ సమావేశంలో ప్రత్యేక అజెండాగా చేర్చింది.

Post a Comment

Previous Post Next Post