Trishul News

జర్నలిస్టులపై అక్రమ కేసులా..పత్రికల పాత్ర ఎంటో జగన్ చెప్పాలి - టిడిపి కార్యదర్శి సవితమ్మ

గోరట్ల, త్రిశూల్ న్యూస్ :
గోరంట్ల మండలంలో జర్నలిస్టులపై అధికార పార్టీ అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతొందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, , రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మలు జర్నలిస్టులపై అక్రమ కేసులో నమోదైన ఘటనపై తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని చంద్రశేఖర థియేటర్ వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పెనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ అనుచరుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయని సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా ద్వారా శాసనసభ్యులు కుటుంబ సభ్యులతో పాటు కొందరు పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నడం నిజం కాదా అని ప్రశ్నించారు. మీ కార్యకర్తలే మీపై విమర్శలకుపిస్తున్నారని మీపై చెప్పులు సురుతున్నారని, మీపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఐతే మీరు ఏమి చేయలేక పోలీసులను అడ్డుపెట్టుకొని జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు సవితమ్మ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటి జర్నలిజంపై అధికార పార్టీ కక్షలు పెంచుకొని కేసులు నమోదు చేయించి వారిని సైతం భయభ్రాంతులకు గురి చేసేందుకు సిద్ధపడటం రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. గోరంట్లలో జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసు నుంచి వారి పేర్లను వెంటనే తొలగించాలని బాధిత జర్నలిస్టులకు అండగా ఉంటామని సవితమ్మ హామీ ఇస్తూ వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ స్మిత్ నిమ్మల శ్రీధర్ , గౌరాపురం శ్రీనివాసులు, బాలకృష్ణ చౌదరి, బూదిలి లక్ష్మీపతి, నిమ్మల కృష్ణమూర్తి, పసుపులేటి శ్రీనివాసులు, ఎల్ ఎన్ నారాయణస్వామి, తిప్పరాజపల్లి రాజా, గిద్దలూరు రామ్మోహన్, గుంటిపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post