Trishul News

కూతురి స్నేహితురాలిపై అత్యాచార యత్నం..!

-  దేహశుద్ధి చేసిన గ్రామస్థులు.. నిందితుడు అరెస్ట్ 
చిలమత్తూరు, త్రిశూల్ న్యూస్ :
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా కూతురి స్నేహితురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. చిన్న పిల్ల అని చూడకుండా తన బైక్‌పై తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరులో చోటుచేసుకుంది. చిలమత్తూరులో గ్రామంలో నివసించే శ్రీనివాసులు ఇంటి ముందు ఓ చిన్నారి తన స్నేహితురాలితో ఇంటి ముందు ఆడుకుంటోంది. అప్పుడు ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను శ్రీనివాసులు బైక్‌పై తీసుకెళ్లాడు. ఆ పాప అంకుల్‌ అంటూ బండి మీద కూర్చుంది. ఎవరూ లేని ప్రదేశం చూసి తన కుమార్తె స్నేహితురాలిపై శ్రీనివాసులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి గట్టిగా ఏడ్వడంతో అక్కడికి గ్రామస్థులు చేరుకున్నారు. ఆ కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ నిందితుడిపై ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Post a Comment

Previous Post Next Post