Trishul News

ఉపాధికి హామీ చట్టానికి ఉరేసిన కేంద్ర బడ్జెట్..!

- పేదల పొట్ట కొట్టి పెద్దలకు పెట్టేలా మోడీ సర్కారు తీరు

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీను నాయక్
షాద్ నగర్, త్రిశూల్ న్యూస్ :
కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరేసిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ తీరు పేదల పొట్ట కొట్టి పెద్దలకు పెట్టేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార సబ్సిడీ. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీల పైన భారీ ఎత్తున కోత విధించడం వలన గ్రామీణ ప్రాంత పేదల నోట్లో మట్టి కొట్టారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉపాధి కూలీలకు 100 రోజులు పని కల్పించాలంటే  1.85.000 కోట్ల బడ్జెట్ అవసరమని, గత బడ్జెట్లో 89వేల కోట్ల రూపాయలను కేటాయించిన మోడీ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో 60 వేలకోట్ల రూపాయలను మాత్రమే కేటాయించిందన్నారు. 40% పైగా నిధులను తగ్గించడం అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీలకు 35 రోజులు మాత్రమే  పనిని కల్పిస్తుందన్నారు. క్రమంగా  ఉపాధి హామీ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడడం దేశంలో 15 కోట్ల కుటుంబాలను ఉపాధికి దూరం చేయడమే అవుతుందన్నారు. మన రాష్ట్రంలో 55 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఆహార భద్రతను కల్పించడం కోసం గత సంవత్సరం 2, 87, 194  కోట్లను బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1, 97,350 కోట్లకు తగ్గించింది అంటే సబ్సిడీ బియ్యం గోధుమలు పిండి పామాయిల్ వంటివి అందించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం  తప్పుకోవాలని చూస్తుందన్నారు. రైతులకు అందించే ఇన్పుట్ సబ్సిడీ రెండు లక్షల 25 వేల కోట్లు గత బడ్జెట్లో కేటాయించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1,75 వేల కోట్లకు తగ్గించింది ఒక్క యూరియా పైన నే 15 వేల కోట్లను తగ్గించటం ఆందోళన కలిగిస్తోందన్నారు. పంట గిట్టుబాటు ధర గురించి చట్టం తీసుకొస్తామని చెప్పిన మోడీ పార్లమెంట్ లో ఆ విషయంపై ఒక్క మాట మాట్లాడకపోవడం ఏమిటంటే ప్రశ్నించారు? ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post